ఆహారంరాజకీయం

దేశంలో వరుసగా 18వ రోజు డీజిల్‌ ధరలు.

న్యూడిల్లీ దేశంలో వరుసగా 18వ రోజు డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.ఈ రోజు లీటర్‌ డీజిల్‌పై 48పైసలు చొప్పున పెంచిన సంస్థలు పెట్రోల్‌ ధరలను యథాతథంగానే కొనసాగించడం గమనార్హం. దీంతో పెట్రోల్‌ ధరను డీజిల్‌ దాటేసింది. పెట్రోల్‌ ధర కంటే డీజిల్‌ ధర ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి.తాజా పెంపుతో రూ.79.40గా ఉన్న లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.79.88కి పెరగ్గా.. పెట్రోల్‌ ధర మాత్రం యథాతథంగా 79.76వద్ద ఉంది.ఈ 18 రోజుల కాలంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.9.41.. డీజిల్ ధర 9.58 చొప్పున పెరిగాయి.