ఆహారంగ్రామీణంరాష్ట్రీయం

నియోజకవర్గంలో అదనంగా మూడు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించిన – సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య

నర్సీపట్నం : కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి బుధవారం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య నియోజకవర్గ పరిధిలో గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం పిహెచ్ సి లలో అదనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తగు జాగ్రత్తలతో , అప్రమత్తంగా వ్యవహరించాల్సినదిగా సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బందిని ఆదేశించారు.ఈ నెల 16వ తేదీనుండీ మొదలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో బుధవారం మూడు మండలాల పీహెచ్సీలలో అదనంగా ప్రారంభించారు.