రాష్ట్రీయం

4వ విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ఏలూరు, ఫిబ్రవరి 10 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగో విడత ఎన్నికల పక్రియ బుధవారం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు డివిజన్ 12 మండలాల్లోని 266 గ్రామ పంచాయితీలలో ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందన్నారు. ఏలూరు డివిజన్‌కు సంబంధించిన మరో నాలుగు మండలాలు అయిన చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురంలోని పంచాయితీలకు 3వ విడతలో జరిగే ఎన్నికల నోటిఫికేషన్లో విడదలచేయడం జరిగిందన్నారు. ఈ నాలుగు మండలాల్లో జంగారెడ్డి డివిజన్‌లోని మండలాలలో కలిపి ఈ నెల 17న ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరు డివిజన్ 12 మండలాలకు సంబంధించి ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందన్నారు.

13న నామినేషన్ల పరిశీలన, 14న అభ్యంతరాలు పరిశీలన, 15 అభ్యంతరాలపై నిర్ణయం, 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు, 21న ఉదయం 6.30 గం.ల నుంచి మద్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు వుంటుందన్నారు. ఎన్నికలకు 166 మంది స్టేజ్-1 అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. భీమడోలు 13, దెందులూరు 17, ద్వారకాతిరుమల 28, ఏలూరు 15, గణపవరం 25, నల్లజర్ల 24, నిడమర్రు 16, పెదపాడు 23, పెదవేగి 30, పెంటపాడు 21, తాడేపల్లిగూడెం 27, ఉంగుటూరు 27 మొత్తం 266 పంచాయితీలకు గాను 2,800 వార్డులు వున్నాయని తెలిపారు. ఏలూరు డివిజన్లో 6,54,230 మంది ఓటర్లు పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, వీరిలో 3,23,302 మంది పురుషులుకాగా, 3,30,898 మంది మహిళా ఓటర్లు, 33 మంది ఇతరులు వున్నారని తెలిపారు. 166 మంది స్టేజ్-1 అధికారులను, 299 స్టేజ్-2 అధికారులతో పాటు ఇతర సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించడం జరిగిందన్నారు. 2,433 చిన్న, 739 మధ్య, 640 పెద్ద సైజు బ్యా లెట్ బ్యాక్సులు ఎన్నికల నిర్వహణకు అవసరం వున్నట్లు తెలిపారు. 24 జోన్లు, 88 రూట్లుగా విభజించి 580 ప్రాంతాలలో 2,850 పోలింగ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటుయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.