కోల్‌కతా, జనవరి 27 (న్యూస్‌టైమ్): మాజీ భారత కెఫ్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి గుంగూలీని తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ మధ్యే సౌరవ్ గంగూలీకి గుండె పోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త వినగానే క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.