ఆహారంప్రాంతీయంరాష్ట్రీయం

నూతన జాతీయ విద్యా విధానానికి ఎ.బి.వి.పి స్వాగతం.

కాకినాడ : 21వ శతాబ్దపు భారతదేశాన్ని నిర్మించడంలో నూతన జాతీయ విద్యా విధానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.. దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ విద్యావిధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి అమలు చేసే చర్యను ఎ.బి.వి.పి హృదయ పూర్వకగా స్వాగతిస్తుందని ఒక ప్రకటనలో ఎ.బి.వి.పి జిల్లా సంఘటనా కార్యదర్శి అడిగర్ల సతీష్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ కాలంలో భారతీయ పౌరులు జాతీయ విద్య విధానం ద్వారా ప్రాధమిక ఉన్నత విద్య వ్యవస్థలలో మార్పును ఆశిస్తున్నారన్నారు. విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్దికి జ్ఞానం ఆధారిత ఉపాధి ఆధారిత సాంకేతిక ఆధారిత విద్య ఆధారంగా భారతీయ విద్యా వ్యవస్థలలో నూతన సంస్కరణలకు జాతీయ విద్యావిధానం చాలా అవసరమన్నారు భారతీయుల అంచనాలను,విలువల ఆధారంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్య విధాన అవసరం చాలా కాలంగా ఉందని తెలిపారు.భారత ప్రజలకు సుదీర్ఘ కాలంగా అవసరమయ్యే ప్రధాన సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారించి ఈరోజు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలు సగటు భారతీయ విద్యార్థుల కలలు సాహకారం అయ్యే దిశగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.చిట్టచివరి విద్యార్థి వరకు ఈ నూతన సంస్కరణలు అమలు అయ్యేలా చూడాలని ఆయన కోరారు…