ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం.

* సబ్ కలెక్టర్ మరియు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్  అధారిటీ ఎన్ మౌర్య…

నర్సీపట్నం : ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటు…అత్యంత సమస్యాత్మక , సమస్యాత్మక కేంద్రాల్లో వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు.స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.బీ ఎల్ వో ల ద్వారా ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణి పటిష్టమైన పోలీసు బందోబస్తుఏర్పాటు…
          ఈనెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ మరియు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఎన్ మౌర్య తెలిపారు. మంగళవారం ఉదయం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ గురువారం జరగనున్న  ఎంపీటీసీ, జడ్పిటిసి,ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు.10 తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు.ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశించడం జరిగిందన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా బీ ఎల్ వో లు ఇంటింటికీ వెళ్ళి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారన్నారు.పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి నర్సీపట్నం డివిజన్ 10 మండలాలలో గల అన్ని పోలింగ్ కేంద్రాలలో నిరంతర విద్యుత్, త్రాగు నీటి సౌకర్యం,శానిటేషన్, మరుగు దొడ్లు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం, వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేవిధంగా వైద్యసిబ్బందికి ఆదేశించామన్నారు.అత్యవసర వైద్యనిమిత్తం ఫస్ట్ ఎయిడ్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
         అత్యంత సమస్యాత్మక  కేంద్రాలలో వీడియోగ్రఫీ,సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ కాస్టింగ్  చేయడం జరుగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఆర్ వో లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు,జోనల్ అధికారులు,రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారన్నారు. నర్సీపట్నం డివిజన్ 10 మండలాలకు సంబంధించి 597 పోలింగ్ కేంద్రాలు కాగా, వాటిలో అత్యంత సమస్యాత్మక 73, సమస్యాత్మక 88 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు.పీవోలు 639 , ఏపీవోలు 621 , ఓ పీ వో లు 1702, జోనల్ అధికారులు 60, రూట్ ఆఫీసర్స్ 91, ఫ్లైయింగ్ స్క్వార్డ్స్ 10 , మైక్రో అబ్జర్వర్లు,స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు…

Latest News