ఆహారంజిల్లాలురాజకీయం

అనర్హులకే ఇళ్ల పట్టాల జాబితాలో చోటు – జ‌న‌సేన‌

నర్సీపట్నం నియోజకవర్గం నాలుగు మండలాల్లో కూడా అర్హులను కాకుండా అనర్హులకు ఇళ్ల పట్టాల జాబితాలో చోటు కల్పించారు దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం నియోజకవర్గం నాయకులు రాజన వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీవో ఆఫీస్ ముందు నిరసన తెలియజేసి ఆర్ డి ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంద‌ర్భంగా సూర్య చంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో నాతవరం మండలం చెర్లపాలెం గ్రామం శివారు లక్ష్మీపురం గ్రామంలో అధికంగా ఇళ్ల పట్టాలు విషయంపై పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల జాబితా చూస్తే ఇల్లుఉన్నవాళ్ళ పేర్లే అధికంగా ఉన్నాయి పేర్కోన్నారు. ఇల్లు లేని పేదలకు ఆ జాబితాలో చోటు కల్పించలేదన్నారు.ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేయాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మేం మతం, చూడం కులం చూడం, ప్రాంతం చూడం పార్టీ చూడం అని చెబుతుంటే కింది స్థాయి నాయకులు మాత్రం వాలంటీర్ల ప్రోద్బలంతో జాబితాలో పేర్లు మార్చి సచివాలయ సిబ్బందిని పక్కన పెట్టుకొని మరి ఇళ్ల పట్టాలు జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నార‌న్నారు. ఇది ఎంతవరకు సమంజసమ‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్,రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి, పంచాడ హరినాథ్, కొప్పాక కళ్యాణ్, గూడెపు తాతబాబు, బి. మురళి, పి. నాగు,వి. జానీ,వెంకటరమణ , అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు…