ఆహారంజిల్లాలుప్రాంతీయం

రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలు చేసిన ఘ‌న‌‌‌త మహనేత స్వ‌ర్గీయ రాజశేఖర్ రెడ్డిదే.

  • వైయస్సార్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్.

నర్సీపట్నం: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేసిన ఘ‌న‌త మహనేత స్వ‌ర్గీయ రాజశేఖర్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కోన్నారు.వైయస్ఆర్ జ‌న్మ‌ధినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా గల వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు.అనంతరం ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకు వచ్చిన 104 వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ 2003వ సంవత్సరములో 40 డిగ్రీల ఎండనుసైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలకతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104, వాహనాలు ఒంటి గొప్ప ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు వైయస్సార్ అని అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. వారు మరణించిన తర్వాత వారి కుమారుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా మరీ ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఒక్క ఏడాదిలోనే 90 శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రమంతటా ఈ రోజును రైతు దినోత్సవం గా జరుపుకుంటున్నారు అని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నిజమైన భరోసా ముఖ్యమంత్రి అందించారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, చింతకాయల సన్యాసి పాత్రుడు, గొలుసు నరసింహమూర్తి, క‌ర్రి శ్రీనివాస‌రావు, గుడబండి నాగేశ్వరరావు, మాకి రెడ్డి బుల్లి దొర, తమరాన నాయుడు యాకా రాజు బాబు,ఆరు గొల్లు రాజు బాబు, మరియు మహిళా వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు…