ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాష్ట్రీయంస్థానికం

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘననివాళ్లు.

నర్సీపట్నం,కోస్తాటైమ్స్ : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వాసవి కళ్యాణ మండప సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్థానిక  పాల్గాట్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వాసవి కళ్యాణ మండప సంఘంలో గల పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు కూడా పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు… ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యనిర్వాహక సభ్యులు మరియు ఎన్నారై వాసవి అసోసియేషన్ కన్వీనర్ వెలగా నారాయణరావు మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటుకు నాంది పలికిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. వారి స్ఫూర్తితో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమండప సంఘం అధ్యక్షులు జాలుమూరి బంగారాజు, వాసవి ఆయుష్మాన్ క్లబ్ అధ్యక్షుడు కుసుమంచి వెంకటకృష్ణ మరియు వాసవి టెంపుల్ ట్రస్ట్ తరపున పూసర్ల సోమేశ్వరరావు,వూడా రాము, గ్రంధి వెంకటకృష్ణ మరియు వాసవి క్లబ్ కార్యదర్శి పెనుగొండ రమేష్ , పచ్చిగోళ్ళ నారాయణరావు, కడిమిశెట్టి రమణాజీ , వాసవి వనిత క్లబ్ ప్రతినిధులు దేవత అరుణ,పద్మనాభుని రాజేశ్వరి మరియు ఇతర సంస్థల సభ్యులు పాల్గొన్నారు…