ఆహారంస్థానికం

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి – సీఎం జగన్ కు కన్నాలేఖ.

అమరావతి : కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు.ఈ మేరకు సీఎం జగన్‌కు కన్నా లేఖ రాశారు.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరగుతున్నాయన్నారు. సమాజ వ్యాప్తి పెరడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ప్రస్తుతం‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు చేసిన విధంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరారు. పరీక్షా కేంద్రాలలో, ప్రయాణించే సమయాలలో రద్దీ వల్ల విద్యార్థులకు చాలా ప్రమాదం ఏర్పడుతుందని…అందువల్ల పదో తరగతి పరీక్షలను రద్దు చేసి… తర్వాతి తరగతులకు పంపాలని కోరుతున్నామని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.