జాతీయంరాజకీయంరాష్ట్రీయం

పోలవరం నిర్వాసిత ముంపు గ్రామాల సమస్యలపై కేంద్ర జల శక్తి మంత్రిని కలిసిన రాష్ట్ర బిజెపి నాయకులు.

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేకావత్ వారి నివాసంలో కలిసిన సోము సారథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ బృందం.

ఈమధ్యనే పోలవరం ప్రాజెక్టును సమీక్షించిన సోము వీర్రాజు గారు అనంతరం ,పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాలు తదితర అంశాలను మంత్రికి వివరించిన భాజపా చీఫ్ సోము వీర్రాజు.

ఆర్ ఆర్ ప్యాకేజీకి సంభందించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని తెలుపారు.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్ ల స్టేటస్లు వివరించారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్,మైనర్ ప్రాజెక్టులకు సంభందించి చర్చించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవిచూపి ఆయా ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో  వారి సలహాలు సూచనలు కేంద్ర మంత్రికి వివరించిన సోము వీర్రాజు.ఆయనను కలిసిన అనంతరం కేంద్ర మంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించమని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో సభ్యులు సోము వీర్రాజు గారితో పాటు మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ,ఎంపీలు సి.ఎం.రమేష్ , టి.జి.వెంకటేష్, జి.వి.ఎల్ నరసింహారావు,ఎమ్మెల్సీ పివియన్ మాధవ్,విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి తదితరులు…