రాష్ట్రీయంస్థానికం

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు : కరోనా వైరస్ పేరుతో హిందూ దేవాలయాలను, సత్రాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మారుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.ఎక్కడా అవకాశం లేనట్లు అన్నవరం కొండ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తుందనడంలో సందేహం లేదన్నారు.ప్రజా అవసరాల పేరుతో ఇలాంటి చర్యలు చేపట్టి హిందువులను అవమానిస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సామాజిక అసమానతలు, మత కలహాలను సృష్టించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.అన్నవరంలో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల వద్ద క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు…