ఆంధ్రప్రదేశ్న్యూస్రాజకీయం

ఈ నెల 9న ఒరిస్సా పర్యటన సియం జగన్

అమరావతి-కోస్తాటైమ్స్‌ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 9న భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో జగన్ భేటీ కానున్నారు.ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి మాట్లాడనున్నారు.వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. చాలా రోజులుగా పోలవరంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.ఈ పర్యటనలో ఒడిషా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను జగన్ కలవనున్నారు.కాగా నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలనిఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని గతంలో నవీన్ పట్నాయక్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు…