ఆహారంరాష్ట్రీయంస్థానికం

ఏపీ కొత్త జిల్లాల కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తజిల్లాల ఏర్పాటు విషయంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీస్‌ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్‌ సెక్రటరీ వ్యవహరిస్తారు.ఇటీవల కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.మూడు నెలలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది…