ఆహారంప్రాంతీయంరాజకీయం

నర్సీపట్నం కేంద్రంగా అల్లూరి జిల్లా ఏర్పాటు చేయాలి.

నర్సీపట్నం : విప్లవ వీరుడు,మన్యం ప్రజల ఆశాజ్యోతి,స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి  ముఖ్యఅతిథి నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తం చేయడానికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు.అమాయక గిరిజనులపై జరుగుతున్న దోపిడీ అత్యాచారాలపై తనదైన పోరాట పొందాలో యావత్ సమాజాన్ని ముందుకు నడిపారన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ సమయం నుండి అత్యంత ప్రాధాన్యత ఉన్న నర్సీపట్నాని కేంద్రంగా చేసుకొని అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ఎంతో స్ఫూర్తిదాయక మన్నారు. స్వతంత్ర సమరంలో ఎంతోమంది వీరులకి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.వారి అడుగు జాడలలో ప్రజల ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతలు బుచ్చిరాజు,మహిళ మోర్చా నాయకురాలు ఎస్.మల్లేశ్వరి,యువ మోర్చా అధ్యక్షులు మల్ల పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు…