ఆహారంరాష్ట్రీయంస్థానికం

దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం.బిజెపి నర్సీపట్నం

నర్సీపట్నం – తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల ఆస్తుల  పరిరక్షణకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధంమని  నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు పట్టణ అధ్యక్షులు  యడ్ల గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఉపవాస దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేవుడు ఆస్తులకే రక్షణ లేకపోతే సామాన్య మానవులకు ఏవిధంగా రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయ భూముల అమ్మకాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తులు తమ ఇష్ట దైవాలకు కైంకర్యంగా ఇచ్చిన భూములు ఆస్తులను అమ్మే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదన్నారు. దేవాలయ భూములు అమ్మి ఇతర మతస్తుల తాయిలాలు ఇవ్వడం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమేనని దేముడి ఆస్తి జోలికి వెళ్తే చూస్తూ ఉండమని హెచ్చరించారు. పట్టణ అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ టీటీడీ మరియు దేవాల ఆస్తుల పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతాడ నుకేశ్వర రావు ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొంప వెంకటేశ్వర యాదవ్ (బాబా), ఓబీసీ మోర్చా టౌన్ అధ్యక్షులు కామేశ్వరరావు, పల్లా రమణ యాదవ్ , మహిళా మోర్చా నాయకురాలు  వెంకటలక్ష్మి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు నేతల బుచ్చిరాజు, పట్టణ ఉపాధ్యక్షులు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు