అవీ ఇవీ...ఆహారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.మొత్తం 426 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 పోస్టుల్ని, 3 ప్రభుత్వ నర్సింగ్ స్కూల్స్‌లో 144 పోస్టుల్ని భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రమోషన్, రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. నర్సింగ్ ఎడ్యుకేషన్‌లో ప్రభుత్వం సృష్టించిన కొత్త ఉద్యోగాలు ఇవి. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, శ్రీకాకుళం రిమ్స్, మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రుల్లో గల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 పోస్టులు భర్తీ కానున్నాయి.వీటితో పాటు ఒంగోలులోని రిమ్స్, తిరుపతిలోని ఎస్‌వీఆర్ఆర్ జీజీహెచ్, ఏలూరులోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలో గల ప్రభుత్వ నర్సింగ్ స్కూల్స్‌లో 144 పోస్టులు భర్తీ కానున్నాయి.టీచింగ్ స్టాఫ్‌లో వైస్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, ట్యూటర్ పోస్టులున్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి.త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. డిగ్రీ పాసైనవారికి 1564 పోలీస్ ఉద్యోగాల ఖాళీల వివరాలు …
ఆంధ్రప్రదేశ్‌లో 665 జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు..
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, గుంటూరు- 35 టీచింగ్ స్టాఫ్ + 59 నాన్ టీచింగ్ స్టాఫ్
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, శ్రీకాకుళం- 35 టీచింగ్ స్టాఫ్ + 59 నాన్ టీచింగ్ స్టాఫ్
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, మచిలీపట్నం- 35 టీచింగ్ స్టాఫ్ + 59 నాన్ టీచింగ్ స్టాఫ్ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, ఒంగోలు- 14 టీచింగ్ స్టాఫ్ + 35 నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, తిరుపతి- 11 టీచింగ్ స్టాఫ్ + 35 నాన్ టీచింగ్ స్టాఫ్..ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, ఏలూరు- 14 టీచింగ్ స్టాఫ్ + 35 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నాయి.