విభాగాలను పరిశీలించిన ఏయూ రెక్టార్

విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలోని పలు విభాగాలను వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత పరిశీలించారు. మంగళవారం విభాగాలలో తరగతులు జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. విద్యార్థులు తరగతులను నిత్యం హాజరు కావాలని, కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు తరగతి గదుల్లో, హాస్టల్స్‌లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Latest News