ప్రాంతీయంసంస్కృతి

బాల బాలాజీ ఆదాయం ప్రకటన

కాకినాడ, మార్చి 8 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ బాల బాలాజీ దేవస్థానంలో ఈ రోజు లడ్డు ప్రసాదం విక్రయం, దర్శనం టిక్కెట్లు విక్రయం ద్వారా రూ. 1,45,172/-లు, నిత్య అన్నదాన ట్రస్ట్‌కు విరాళాల ద్వారా రూ‌. 71,489/-లు. వెరశి మొత్తం ఆదాయం రూ. 2,16,661/-లు సమకూరిందని, శ్రీ స్వామి వారిని 2547 మంది దర్శించుకున్నారని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పిచ్చిక శివ నాగ సత్యనారాయణ (చిన్నా), ధర్మ కర్తల మండలి సభ్యులు, సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు తెలిపారు.