ఆహారంజాతీయం

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం-రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

లద్దాఖ్‌: భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యమ‌ని అంగుళం భూభాగాన్నికూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటించి వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్వాన్‌ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుటోందని ప్రపంచానికి భారత్‌ శాంతి సందేశాన్ని ఇచ్చింది. భారత్‌ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదన్నారు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. భారత్‌లోని అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ తాకలేరని,ఎవరైనా దురాక్రమణకు దిగితే దీటైన సమాధానం ఉంటుందన్నారు. దేశ గౌరవం అన్నింటికంటే చాలా గొప్పది. దేశ గౌరవంపై దాడిచేస్తే ఏ మాత్రం ఉపేక్షించమ‌ని పేర్కోన్నారు. భారత్‌ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరు, సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ చర్చలు ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయో ఇప్పుడే చెప్పలేమ‌ని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు…