చెవిరెడ్డిని పరామర్శించిన జగన్
తిరుపతి, జనవరి 23 (న్యూస్‌టైమ్): వైయస్ఆర్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోదరుడు హనుమంతరెడ్డి నిన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. హనుమంతరెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ సానుభూతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పలువురు నేతలు హనుమంతరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.
ప్రభుత్వ విప్ చెవిరెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ భారతమ్మ సోదరుడు దినేష్ రెడ్డి, ఏపీఐఐసి చైర్మెన్ రోజా పరామర్శించారు. శనివారం ప్రముఖులు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముందుగా హనుమంతు రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం చెవిరెడ్డి, తల్లిదండ్రులు మునిరత్నమ్మ, సుబ్రమణ్యం రెడ్డిలను పరామర్శించారు. వారు కన్నీటి పర్యంతమవడంతో ఓదార్చారు. హనుమంతు రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఏపీఐఐసి చైర్మెన్, నగరి ఎమ్మెల్యే రోజా తుమ్మలగుంటకు చేరుకొని హనుమంతురెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంతకుముందు చెవిరెడ్డిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.