ఆహారంరాష్ట్రీయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వ‌హించిన బిజెపి నాయ‌కులు .

నర్సీపట్నం: ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 వ వర్ధంతి వేడుకలను పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో నాయకులు నిర్వహించారు. స్థానిక పెద్దబొడ్డేపల్లి ఎస్సీకాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద ముందుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక అబీడ్ సెంటర్ లో గల విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహావ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. దేశంలో షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల విద్య అభివృద్ధికి పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త ,మానవతావాది , రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిందాడ నూకేశ్వరరావు, యువ మోర్చా నాయకులు బోలెం శివ, పృథ్విరాజ్, పట్టణ ఎస్సీ మోర్చా నేతల బుచ్చిరాజు రాజాన రమణ, కరణం ఈశ్వరరావు, మహిళా మోర్చ అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరి,కెవి లక్ష్మి , అప్పల నరస,చవాకుల నూకరాజు తదితరులు పాల్గొన్నారు…