నర్సీపట్నం : కేంద్ర ప్రభుత్వం Ews కు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన దానిని రాష్ట్రంలో అమలు చేయకపోవడం దారుణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కానుకల పేరుతో మోసగిస్తూ పబ్బం గడుపుకుంటున్న దన్నారు. బ్రహణ, వైశ్య క్షత్రియ, కాపు వంటి అగ్రకులాల నిరుపేదలకు ఈ డబ్ల్యూ ఎస్ పది శాతం రిజర్వేషన్లు ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు. అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అగ్రకులాల నిరుపేదలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేయడం దారుణమన్నారు.జనసేన నాయకులు రాజాన సూర్య చంద్ర మాట్లాడుతూ అగ్రకుల నిరుపేదలకు రిజర్వేషన్ దక్కే వరకూ బిజెపితో కలిసి పోరాటం చేస్తామన్నారు. జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు బంగారు ఎర్రినాయుడు మాట్లాడుతూ కార్పొరేషన్ల పేరుతో కులాలను విడదీస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని పేదల అభివృద్ధి కోసం చేస్తున్న చట్టాలను రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ యువమోర్చా అధ్యక్షులు మల్ల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ల వలన అగ్రకులాల నిరుపేదలకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేవరకు యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్ , మండల అధ్యక్షులు ఊడి చక్రవర్తి, బిజెపి నాయకులు గొంప వెంకటేశ్వర్ యాదవ్ (బాబా),పిల్లా వెంకటేశ్వరరావు, కురచ కామేశ్వరరావు,ఎస్సీ మోర్చా నాయకులు నేతల బుచ్చిరాజు, మహిళా మోర్చా నాయకులు ఎస్ మల్లేశ్వరి, నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకటరమణ, కుమారస్వామి ,గవిరెడ్డి త్రినాధ్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు లక్కోజు విక్రమ్, సూరిబాబు వేముల సూర్యారావు,బొడ్డు రజని, మాకవరపాలెం మండల అధ్యక్షులు గవిరెడ్డి రఘుచక్రవర్తి,గంగాధర్,మరిసా నాయుడు, కుల్లయ్య, పద్మ, గొలుగొండ మండల నాయకులు పల్లా రమణ యాదవ్, కిల్లాడ లోకేష్ ,యువ మోర్చా అధ్యక్షుడు ప్రసాద్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…