ఆహారంజాతీయం

క‌ల్నల్ సంతోష్ బాబుకి నివాళ్ళు అర్పించిన గవర్నర్ సౌందరరాజన్, మంత్రులు

  • కల్నల్ సంతోష్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన గవర్నర్
  • రేపు ఉదయం 8 గంటలకు కేసారంలో అంత్యక్రియలు

సూర్యాపేట‌- ల‌డాక్‌ వద్ద చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి జ‌రిగిన ఘర్షణలో వీర‌మ‌ర‌ణం పొందిన తెలుగు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్నిసూర్యాపేట తీసుకువస్తున్నారు. హైదరాబాదు హకీంపేట విమానాశ్రయం నుంచి సైనిక అధికారులు పార్ధివ‌దే్‌హ‌న్నితరలిస్తున్నారు.అంతకుముందు హకీంపేట విమానాశ్రయంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి సైనిక వందనం నిర్వహించారు. ఈ అమరవీరుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు నివాళి అర్పించారు. కాగా, రేపు సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనం సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కేసారంలో కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి చెంది భూమిలో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.