ఆహారంస్థానికం

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడాలి.

అనకాపల్లి,మే-20: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, మరియు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయటాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త కార్యక్రమం స్థానిక ఆర్డీవో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బి.యం.ఎస్ రాష్ట్రఉపాధ్యక్షులు గోకువాడ శ్రీరాములు మాట్లాడుతూ ఆర్డీవో ద్వారా గౌరవ రాష్ట్రపతి గార్కి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందన్నారు.వివిధ రాష్ట్రాలలో కార్మిక చట్టాలను రద్దు పరచడమే కాకుండ పని గంటలు 8 నుండి 12 వరకు పెంచడం దారుణమన్నారు. దీనిని గుజరాత్, మధ్యప్రదేశ్,ఒడిసా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడం జరిగిందని దీనిని వెంటనే ఆపి వేయాలన్నారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరణ చేయాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అందోళన చేయటానికి భారతీయ మాజ్దూర్ సంఘ్ సిద్దంగా ఉందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో విశాఖ గ్రామీణ జిల్లా కార్యదర్శి అంతర్వేది బాబు, జక్కుల గణేష్,మహేష్ పాల్గొన్నారు.