రాష్ట్రీయం

‘చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు’

అమరావతి, మార్చి 5 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య విమర్శించారు. మండలిని తన స్వార్థం కోసం చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నేడు ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 85 శాతానికి పైగా పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారని తెలిపారు. మున్సిపాలిటీల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చందరబాబు ఇప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించకుంటే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు.