చీడిగుమ్మలలో పిహెచ్‌సి ఏర్పాటుకు ప్రతిపాదనపై హర్షం.
గొలుగొండ: మండలం చీడిగుమ్మల గ్రామంలో గ్రామ వాలంటిర్లు, సచివాలయ ఉద్యోగుల తో వైసీపీ నాయకులు సుర్ల గిరిబాబు ఆద్వర్యంలో సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా నిజాయితీ గా సేవలందించాలని కోరారు. రాష్ట్రం సంక్షేమ పథంలో దూసుకుపోయేలా అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే గణేష్ కీర్తి ప్రతిష్టను పెంచే విధంగా మీ పని తీరు మార్చుకోవాలని కోరారు. చీడిగుమ్మలలో పిహెచ్‌సి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన ఎమ్మెల్యేకు హర్షం వ్యక్తం చేస్తూ సమీక్ష నిర్వహించడమైనది. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, వి.ఆర్.ఓ రాజుబాబు, కసిరెడ్డి సత్యనారాయణ, లెక్కల అప్పలనాయుడు, ఇటంశెట్టి రామక్రిష్ణ, ఉలంపర్తి కృష్ణ పాల్గొన్నారు.