ఆంధ్రప్రదేశ్జిల్లాలునేరాలు .. ఘోరాలున్యూస్

ఇటీవల కాలంలో చిన్నారి బాలికపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా.

నర్సీపట్నం : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  ఇటీవల జరిగిన లైంగిక దాడిని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా జరిగింది ఈ ధర్నాలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ నర్సీపట్నంలో బాలికపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం టౌన్ ఇటీవల గంజాయి డ్రగ్స్ మాఫియా మద్యం మాఫియా విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చిన్నారిపై దాడులు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం వెంటనే నిషేధించే చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతాల్లో పోలీస్ లు బాధితుల పక్షాన పోలీసులు వ్యవహరించాలని బాధితులు బెదిరించే పద్ధతులు పోవాలని టౌన్ సీఐ, రూరల్ సీఐ ని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని దానికి కారణమైన మూలాల్ని వెతికి పట్టుకోవాలి స్త్రీలపై జరిగే దాడులు సమాజపరంగా చూడాలని జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులోతెలియజేశారు.నేర విచారణ జరిపించి శిక్షలు కఠినంగా జరిగేటట్లు చేయాలని అందుకు అనుగుణంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సూచన చేశారు.స్త్రీ కేవలం స్త్రీ శక్తి సామర్థ్యాలు గుర్తించాలని స్త్రీని కూడా సమాజంలో పురుషులతో పాటు సమానంగా చూడాలని చెప్పి భావాన్ని వ్యక్తం చేశారు.సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని సంతకాలు సేకరించి అని సచివాలయంలో వినతిపత్రం ఇవ్వాలని చెప్పి స్త్రీలపై జరిగే దాడులు చర్యలు తీసుకోవాలని భవిష్యత్తు తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి. సత్తిబాబు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.యం రామునాయుడు, టిడిపి మహిళా నర్సీపట్నం టౌన్ అధ్యక్షురాలు పి.జగదీశ్వరి మరియు రెల్లి సంఘ నాయకులు ఎర్రంశెట్టి పాపారావు ,రైతు సంఘం జిల్లా నాయకులు ఒనుం శ్రీనివాసరావు మరియు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి సి.పి.ఐ నాయకులు గురు బాబు  మరియు మహిళా సంఘం జిల్లా నాయకులు ఎల్ గారు కె  సూర్య ప్రభ ప్రసన్న.  సిఐటియు నాయకులు ఈశ్వరరావు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయడం జరిగింది. అనంతరం నర్సీపట్నం టౌన్ సిఐ గారికి మరియు రూరల్ సిఐ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది…