ఆహారంజిల్లాలుప్రాంతీయం

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న‌ రాష్ట్రప్రభుత్వం.

విశాఖపట్నం : నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నదని, రిజిస్ట్రేషన్ కి సంబంధించి పట్టా డాక్యుమెంట్లో ఫొటో తో పాటు, ప్లాట్ నెం , బౌండరీలు తదితరాల నన్నిటిని పొందుపర్చా లని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌస్ సైట్ లు, శాండ్, కోవి డ్-19, ఎన్ఆర్ఈజీఎస్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లేఅవుట్లు వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ,ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అర్హులై ఉండి ఇళ్ళ స్థలం రానివారు దరఖాస్తు చేసుకున్న నిర్ణీత గడువు 90 రోజుల లోపల ఇవ్వాల్సి ఉంటుందన్నారు.ఇసుక సేకరణకు సంబంధించి రానున్న పది రోజుల్లోగా జిల్లాలకు అవసరమైన నాణ్యమైన ఇసుకను సేకరించి కొరత లేకుండా నిల్వ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు. హౌసింగ్, స్కూల్ భవనాలు , నాడు-నేడు, అర్ బీ కే, ఇరిగేషన్ పనులపై దృష్టి పెట్టాలన్నారు.ఉపాధి హామీ పనులు మూడు నెల ల్లో ఎనిమిది కోట్ల పనిదినాలు కల్పించి కరోనా కష్ట కాలంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించిన కలెక్టర్ లను అభినందిస్తున్నానన్నారు. గ్రామ సచివాలయాలు,అర్బీకే, వైఎస్ఆర్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు, నాడు-నేడు నిర్మాణాలకు సంభందించి స్థలాలను గుర్తించాలన్నారు. కోవిడ్-19 కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ పది లక్షల టెస్ట్లు చేయించిన జిల్లాయంత్రాంగాన్ని అభినందిస్తున్నానన్నారు.క్వారంటైన్ ఫెసిలిటీస్ బాగుండాలని, కోవిడ్ కేర్ సెంటర్ లలో బెడ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్, నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. వీటన్నిటి పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలక్టర్ వేణు గోపాల్ రెడ్డి, రూరల్ ఎస్పీ బీ.కృష్ణా రావు తదితరులు హాజరయ్యారు…