రాష్ట్రపతికి సీఎం జగన్ ఘనస్వాగతం

రేణిగుంట, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): చిత్తూరు జిల్లా మదనపల్లెలోని చిప్పిలికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మదనపల్లెలోని సత్సంగ్‌ ఫౌండేషన్, పీపుల్‌ గ్రోవ్‌ స్కూల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సందర్శించారు. సత్సంగ్‌ ఫౌండేషన్‌లో మొక్కలు నాటారు.

అదే విధంగా సదనంలోని పీపుల్‌ గ్రోవ్‌ స్కూల్‌లో మొక్కలు నాటి విద్యార్థులతో ముచ్చటించారు. అంతేకాకుండా భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. స్వాస్థ్య ఆస్పత్రి నూతన భవనానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ భూమిపూజ చేశారు.

Latest News