రాష్ట్రీయం

వ్యవసాయ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ అరుణకుమార్, మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ పీ.ఎస్‌.ప్రద్యుమ్న, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పంటల సాగు, ఆర్బీకేల సేవలు తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, మార్కెట్‌ గోడౌన్ల నిర్మాణం వంటి పలు విషయాలను సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. ఈ భేటీ అగ్రికల్చర్ మిషన్‌పై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. రైతు సమ్యలు, పంట రుణాలు, విత్తనాల సరఫరాపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్‌పై కూడా అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రతీ ఆర్బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్‌ యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి మండలంలో ఓ శీతల గిడ్డంగి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతులు పంటల సమాచారాన్ని రైతు భరోసా కేంద్రానికి తెలిపితే ఆ సమాచారం నేరుగా సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుందన్నారు. రైతు తన పంటను అమ్మకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటునందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలన్నారు. సెప్టెంబర్‌కల్లా దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. నిపుణులతో కూడిన మిషన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 2 వేల కోట్లతో విపత్తు నిధి ఏర్పాటు చేయాలని ప్రతి నియోజకవర్గంలో బోర్లు కోసం మిషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. టిడిపి అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాము ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారని, అలాగే చంద్రబాబు వంటి నేతలు ఎల్లప్పుడూ పక్కవారిపై వేలెత్తి చూపడంలో ముందు ఉంటారని, ఇక తమ కారణంగా ఎటువంటి చిన్న తప్పు జరిగినా తమ వల్లే అవినీతి జరిగిందని, అన్యాయం జరిగిందని దుష్ప్రచారం చేస్తారని ఆరోపించారు. ఆ కారణంతోనే గ్రామసచివాలయాల పక్కన ఏర్పాటు చేసే ఎరువులు, పురుగుమందులు, విత్తన దుకాణాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశిస్తున్నామని జగన్ తెలిపారు. ఇక నాణ్యతకు ప్రభుత్వమే స్వయంగా హామీ ఇస్తుందని వెల్లడించారు.