ప్రాంతీయం

కుప్పకూలిన సెల్ టవర్

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తహశీల్దారు కార్యాలయం సమీపంలో ఓ ప్రయివేటు కంపెనీకి చెందిన సెల్ టవర్ కుప్పకూలింది. ఒక్కసారిగా తీవ్ర ఈదురుగాలుల రావడంతో టవర్ కూలిపోయి, కెఎన్ రోడ్‌కు అడ్డంగా పడింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన బొట్టా రాజేష్(43) అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.