తెలంగాణ

ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు

హైదరాబాద్, జనవరి 24 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వారం, పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సూచించారు.