జాతీయం

పది వేల దిగువకు కరోనా కేసులు

24 గంటల్లో 9,102 కొత్త కేసులు.. 117 మరణాలు..

న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): దేశంలో రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్త కేసుల సంఖ్య జూన్ కనిష్ఠానికి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 7,25,577 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,102 వైరస్ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.06 కోట్లుగా ఉంది. అలాగే క్రియాశీల కేసులు 1,77,266కు చేరుకున్నాయి. దాంతో ఆ రేటు 1.73 శాతానికి తగ్గింది.

ఇక, నిన్న కరోనా నుంచి 15,901 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 1,03,45,985 మంది వైరస్ నుంచి బయటపడినట్లయింది. రికవరీ రేటు 96.83 శాతానికి చేరింది. ఈ మహమ్మారి కారణంగా తాజాగా 117 మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య 1,53,587గా ఉంది. మరోవైపు, భారతదేశంలో కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.84 లక్షలకు (1,84,182) అయింది. దీంతో మొత్తం కేసుల్లో వీరి వాటా 1.73% కు కుంచించుకు పోయింది. చికిత్సలో ఉన్నవారిలో అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఈ రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం కేసుల్లో 64.71% పైగా ఉండటం విశేషం. కేరళలో 39.7%, మహారాష్ట్రలో 25% చికిత్సపొందుతున్నవారిలో ఉన్నారు.

గత 24 గంటలలో చికిత్సపొందుతున్న వారిలో నికరంగా 226 కేసులు తగ్గాయి. కొత్తగా పాజిటివ్ కేసులుగా నమోదై మొత్తం పాజిటివ్ కేసులకు గత 24 గంటలలో 13,203 మంది తోడయ్యారు. మరోవైపు, 13,298 మంది గత 24 గంటలలో కోలుకున్నారు. అదే సమయంలో గడిచిన 24 గంటలలో 131 మంది కోవిడ్ వల్ల మరణించారు. ఈ సంఖ్య గత 8 నెలల్లో తక్కువ కావటం గమనార్హం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 19,23,37,117 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో పరీక్షలు మెరుగ్గా జరిగాయి. జాతీయ సగటు అయిన 1,39,374 కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాలు.

15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా నిష్పత్తి ప్రకారం జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలు జరిగాయి. మరోవైపు, ఇవాళ ఉదయం 8 గంటలవరకు 16,15,504 మంది లబ్ధిదారులకు జాతీయ టీకాల కార్యక్రమం కింద టీకాలు అందాయి. గత 24 గంటలలో మొత్తం 694 శిబిరాలలో 33,303 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 28,614 శిబిరాలు నిర్వహించారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య కోటీ మూడు లక్షలు దాటి 1,03,30,084 కి చేరింది. అంటే శాతం పరంగా కోలుకున్నవారి శాతం 96.83% అయింది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం మరింత తగ్గుతూ1,01,45,902 కి చేరింది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 79.12% మంది 9 రాష్ట్రాల్లో కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. వారిలో కేరళలో అత్యధికంగా 5,173 మంది, మహారాష్ట్రలో 1,743 మంది, గుజరాత్‌లో 704 మంది ఒకరోజులో కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ పాజిటివ్‌గా తేలినవారిలో 81.26% మంది కేవలం 6 రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. వీరిలో అత్యధికంగా కేరళలో అత్యధికంగా 6,036 మంది కొత్తగా పాజిటివ్‌గా తేలారు. మహారాష్ట్రలో 2,752 కొత్త కేసులు, కర్నాటకలో 573 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 131 మంది మరణించగా ఏడు రాష్ట్రాలలోనే 80.15% మరణాలు నమోదయ్యాయి. వారిలో మహారాష్ట్రలో అత్యధికంగా 45 మంది చనిపోగా కేరళలో 20 మంది, ఢిల్లీలో 9 మంది మరణించారు.

కాగా, దేశవ్యాప్తంగా సాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమం 11వ రోజు కూడా శిబిరాలు నిర్వహించిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకూ కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య 19.5 లక్షలు దాటి 19,50,183కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 35,785 శిబిరాలు నిర్వహించినట్టు కూడా తాత్కాలిక నివేదిక తెలియజేస్తోంది. 10వ రోజైన 7171 శిబిరాలలో 3,34,679 మందికి టీకాలు వేశారు.