ఆంధ్రప్రదేశ్రాష్ట్రీయంవిశాఖపట్నం

దాహం తీరాలంటే వాగులు దాటాల్సిందే.

కొయ్యూరు,ఈఎన్ఎస్- Sep 11: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు దాహార్తిని తీర్చుకోవడానికి ఉదృతంగా ప్రవహిస్తున్నవాగులు, వంకలు దాటాల్సి వస్తుంది. గిరిజనాభివృద్ధికి కోసం ఐటిడిఏలు ఉన్నప్పటికీ వారి గొంతు తడి తీర్చేందుకు మంచినీటి స‌దుపాయం క‌ల్పించిన‌ నాధుడు కనిపించడం లేదు. ఫలితంగా దాహం తీర్చుకోవడానికి, మంచీనీరు తెచ్చకోవడానికి వాగులు దాటుతున్నారు. తాజంగి శివారు గ్రామాలైన సప్పిడిమెట్ట గ్రామస్తులు. ఈ ప్రాంతంలో మంచినీటి బోర్లు, చలమలు కాని లేకపోవడంతో లంబసింగి సమీప ప్రాంతాలకు రావాల్సి వస్తుంది వీరంతా. ఇక్కడి గిరిజనులంతా పాడేరు ఐటీడీఏ పరిధిలోకి వచ్చినా ఏ ఒక్క అధికారి ఈ గ్రామాలను దర్శించిన పాపాన పోలేదు. ఎండాకాలంలో అయితే పర్లేదుకానీ, ఏ మాత్రం వర్షం పడినా అదిగో పైన చిత్రంలోని విధంగా అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, నెత్తిన నీటి బిందెలు పట్టుకొ చెరువులు దాటాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామ ప్రజలకు మాత్రం దాహార్తి తీర్చుకోవడానికి మంచినీటి బోరుకి నోచుకోలేక పోతున్నామని ఈ గ్రామంలోని గిరిజనులు బావురు మంటున్నారు. తమ కష్టాలు స్వయంగా చూస్తేనైనా ప్రభుత్వం మనస్సు కరుగుతుందో లేదో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్ప‌టికైన ప్ర‌భుత్వ అధికారులు తమ గ్రామానికి ఒక్క మంచినీటి బోరు వేస్తే మా గొంతులు తడిసి, ప్రాణాలతో చలగాటమాడే వాగులు, వంకలు దాటే దుస్తితి తప్పుతుందని వేడుకుంటున్నారు సప్పడిమెట్ట గ్రామస్తులు…