డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ప‌ట్ల ఆప్ర‌మ‌త్తంగా ఉండాలి- జె.సి అరుణ్ బాబు.

నర్సీపట్నం : కరోనా పాజిటివ్ కేసులు డివిజన్ పరిధిలో అధికంగా నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై వైరస్‌ను అరికట్టే విధంగా కృషి చేయాలని డిప్యూటీ కలెక్టర్ జె.సి అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజ‌న్ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప‌లు సూచ‌న‌లు చేసారు. ప్ర‌జ‌లు కోవిడ్ 19 నిబంద‌న‌ల‌ను ఖ‌శ్ఛితంగా అమ‌లు చేసేలా చూడాల‌న్నారు.వ‌ర్షాల‌వ‌ల‌న వ‌చ్చే సీజ‌న‌ల్ వ్యాదుల ప‌ట్ల శ్ర‌ధ్ధ తీసుకోవాల‌ని కోరారు.ఈ కార్యక్రమంలో ప‌లువురు ఎప్పీడిఓలు, వైద్యాధికారులు పది మండలాల్లో పరిధిలో ఉన్న పోలీస్ ఎస్ఐలు పాల్గోన్నారు…

Latest News