నర్సీపట్నం: నియోజకవర్గంలో అనేక సంవత్సరాల కాలం నుండి జీవిస్తున్నటువంటి స్థలాలలో ఉంటున్న పేదవారిని ఖాళీ చేయమంటున్నవిషయమై ఆర్డీఓకు నర్సీపట్నం నియోజకవర్గం నాయకులు రాజన్నవీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో ఫిర్యాదు విన్నపం చేయడం జరిగినది.ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోగల మండలంలో గల చెట్టుపల్లి గ్రామం కొండ దిగువ ప్రాంతం గత ప్రభుత్వం కొంతమందికి పట్టాలు ఇచ్చింది తెలిపారు. ఆ పట్టాలు ఉన్నవారికి ఏమాత్రం చెప్పకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ల స్థలంలో కప్పుకున్న మట్టిలోపలే ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గోతులు తవ్వేసారు ఎందుకని అడిగితే మేము రైతు భరోసా కేంద్రం కడుతున్నాం అని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు.భూమి చెందిన పట్టా చూపిస్తే దౌర్జన్యంతో నీకు ఎవరు ఇచ్చారు వారి వెళ్లి అడుక్కొమని అంటున్నారని ఎర్ర భవాని W/0 ( ఈశ్వరరావు) 2. గంగిరెడ్ల రాజులమ్మ w/0 నాగరాజు వీరిద్దరికీ ఒక సెంటున్నర చొప్పున పట్టా ఇచ్చారన్నారు.ఇదే కాకుండా పిల్లా గడియ్య S/0 వెంకన్న సర్వే నెంబర్ 538 మరియు 5 36 సర్వేనెంబర్ లో గత 60 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని ఈ స్థలం కు సంబంధించి 2018లో ప్రభుత్వం వారు ఈ పాస్ బుక్ కూడా ఇచ్చి ఉన్నారు దీనిని కాదు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మీ స్థలంలో రైతు భరోసా కేంద్రం కడుతున్నాం మీరు ఖాళీ చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారన్నారు.ఇది ఎంతవరకు సమంజసమని ఈ విషయంలో తగుచర్యలు తీసుకొని భాదితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, తాసిల్దార్ కు వినతిపత్రం ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి . టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ .పి. హరినాథ్ కొప్పాక కళ్యాణ్. అల్లు నరేష్. వాక. జానీ. గూడుపు తాతబాబు. చెల్లూరి గుణశేఖర్, కుంచాల మని కిషోర్ తదితరులు పాల్గొన్నారు.