ఘ‌నంగా జరిగిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మదినోత్సవ వేడుకలు.

నర్సీపట్నం : ఒకే దేశంలో రెండు జెండాలు,రెండు రాజ్యాంగాలు, రెండు చట్టాలు చెల్లవని నినదించిన స్వాతంత్ర సమరయోధులు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మదినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.స్థానిక బిజెపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఈనాడు జమ్ము కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలో ఉందంటే దానికి కారణం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీయే ప్రధాన కారణమని జమ్మూకాశ్మీర్లో రెండు జెండాలు రెండు చట్టాలు రెండు రాజ్యాంగాలు అమలును తీవ్రంగా నిరసిస్తూ పోరాటం చేసారాన్నారు. ఆ పోరాట సమయంలో జైలు జీవితం నుంచి ప్రాణాల్నికోల్పోవడం జరిగిందన్నారు. నాటి పోరాట ఫలితంగానే ఈనాడు భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నాటి ప్రధాని నెహ్రూ క్యాబినెట్ లో భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా అతి చిన్న వయసులో కలకత్తా మేయరుగా పని చేశారన్నారు. వారి స్ఫూర్తి తోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగిందని పేర్కొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆలోచలను బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలని కోరారు. పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు అమలుకు కార్యకర్తలందరూ పనిచేయాలన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బంగారు ఎర్రినాయుడు మాట్లాడుతూ మోడీ 2.0లో భాగంగా ప్రతి కార్యకర్త ఈ సంవత్సరం చేపట్టిన పనులన్నీ జన జాగరణ అభియాన్ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ కార్యదర్శి చందక చిన్నికృష్ణ, ఎం పృథ్వి, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లేశ్వరి, కె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…

Latest News