ఆంధ్రప్రదేశ్గ్రామీణంన్యూస్ప్రాంతీయంరాజకీయం

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తుంపాల షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి..

*భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి డిమాండ్.

అనకాపల్లి, కోస్తాటైమ్స్ (ఫిబ్రవరి -16) : తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకులు పీలా మురళి ఆధ్వర్యంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ రెడ్డి మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి విఆర్ఎస్ మంజూరు చేసి షుగర్ ఫ్యాక్టరీను మూత వేసే కార్యక్రమం చేపట్టి షుగర్ ఫ్యాక్టరీ స్థలాలను రైతు భూములను వ్యాపారానికి ప్రైవేటు వ్యక్తులకు కట్టబడేందుకు అడ్డదారులు జగన్ ప్రభుత్వం చేస్తుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన మానుకోవాలని బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ రెడ్డి అన్నారు గురువారం ఉదయం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో రైతులను కార్మికులను షుగర్ ఫ్యాక్టరీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్మికులు తమకు ఉపాధి లేదని ఏ అవకాశాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ ఫ్యాక్టరీ పున్న నిర్మాణం జరిగితే మళ్లీ అనేక వేల మంది ఉపాధి అవకాశాలు అవకాశాలు ఏర్పడతాయని ఈ ఫ్యాక్టరీ మీద 23 వేల కుటుంబాలు 13000 రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయనన్నారు ఈ షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2500 కోట్లు కేటాయించి పెట్టుబడి పెడితే రాష్ట్రంలో ఉన్న మూత పడ్డ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించి రాష్ట్రప్రభుత్వం క్రషింగ్ కు చర్యలు చేపట్టాలని దీనివలన లక్ష కుటుంబాల రైతు కుటుంబాలకు 10,000 కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కేవలం ఉచిత పథకాలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రైతు సంక్షేమ కోసం తక్కువ ఖర్చు పెడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీని వెంటనే నెరవేర్చాలని అన్నారు గతంలో టిడిపి ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీలను రైతులను మోసం చేశాయని అన్నారు. ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీకి మరింత బలేపేతం చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ సుగర్ ఫెడరేషన్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీలు మోడరేషన్ చేసి పునర్ ప్రారంభించాలని లేదంటే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఫ్యాక్టరీలను స్థలాలను రియల్ ఎస్టేట్ లీజు వ్యాపారం చేయాలని కబ్జా చేయాలని చూడడం దురదృష్టకరమన్నారు. అటువంటి ఆలోచన వెంటనే మానుకోవాలని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ రైతు సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతూ సహకార రంగాల ఫ్యాక్టరీలను సంస్థలను కో.ఆపరేట్ సహకార సంస్థలను బలోపేతం చేసేంత కోసం లక్షల కోట్లు కేటాయిస్తుందని వచ్చే ఐదేళ్ల కాలంలో అనేక సహకార సంస్థలను రైతు సహకార ఉత్పత్తుల సంఘాలను ఏర్పాటు చేస్తుందని ఈ సమయంలో షుగర్ ఫ్యాక్టరీలను మూత వేయడం రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని మూత వేసి రైతులను జీవితాలకు ఉరి వేసిందని అన్నారు రైతు సంక్షేమానికి తూట్లు పొడిచే ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కిసాన్ మోర్చ ఇన్చార్జ్ పాకలపాటి రవిరాజు కిషన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంతిన భక్త సాయిరాం, పీఎం కిసాన్ జిల్లా కన్వీనర్ పీలా మురళి సీనియర్ నాయకులు భవన నిర్మాణ రాష్ట్ర నాయకులు అలమండ శ్రీనివాసరావు ప్రొఫెసర్ కె.సత్యరావు, కప్పిరి తాతారావు రైతు నాయకులు మద్దాల ఏరుకునాయుడు కె.రామకృష్ణ కార్మికులు బుద్ధ రామకృష్ణ రైతులకు కార్మికులు రైతులు పాల్గొన్నారు…