జాతీయం

ఆధునిక స్వదేశీ ఫీచర్డ్ మోబ్ కంట్రోల్ వెహికల్స్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన పారామిలటరీ దళాలకు ఆధునిక సాంకేతిక మద్దతును పెంపొందించే ఉద్దేశంతో; శిక్షణ, అధునాతన ఎంపికలతో, సీఎస్ఐఆర్ తన మూడు సృజనాత్మక వేరియంట్లు ‘కాంపాక్ట్, మీడియం, హెవీ’ కేటగిరీ మోబ్ కంట్రోల్ వెహికల్స్ (ఎంసీవీలు) కేంద్ర హోం ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన సభ్యుల బృందానికి సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శించింది. గురుగ్రామ్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ ప్రదర్శన విజయవంతంగా జరిగింది. ఇది దేశంలో మొట్టమొదటి అధునాతన స్వదేశీ రూపకల్పన, ఫీచర్డ్ డెవలప్‌మెంట్.

భారతదేశంలో స్వదేశీ ట్రాక్టర్ విప్లవాన్ని తీసుకొచ్చిన దుర్గాపూర్ కేంద్రంగా పనిచేసే సీఎస్ఐఆర్ రాజ్యాంగ ప్రయోగశాల సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) ద్వారా ఎంసీవీలను డిజైన్ చేసి, అభివృద్ధి చేయడం జరిగింది. ఈఎంసీవీ ప్రోటోటైప్‌ల హెవీ కేటగిరీ 7.5 టన్నుల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంది. మీడియం కేటగిరీ 2.5 టన్నుల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంది. కాంపాక్ట్ ఒక ట్రాక్టర్ ఆధారిత వాహనం. కీలక ఆవశ్యకత, అనుసరించిన స్పెసిఫికేషన్ల మేరకు వీటిని అభివృద్ధి చేశారు.

ప్రోటోటైప్‌ల్లో వెహికల్ కేటగిరీ, మోబ్ కంట్రోల్ సమయంలో ఆపరేషనల్ ఆవశ్యకతకు అనుగుణంగా అనేక స్వతంత్ర ఆపరేషనల్ యూనిట్లు ఏకీకృతం చేసిన అనేక స్వతంత్ర ఆపరేషనల్ యూనిట్లు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు కొన్ని, ఆపరేషనల్ యూనిట్లు ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ షావెల్, రిట్రాక్టబుల్ ప్రొటెక్టివ్ ఫ్రంట్ షీల్డ్, ఆల్ రౌండ్ ఇరిటాంట్ స్ప్రే సిస్టమ్, ఫోమ్ స్ప్రే సిస్టమ్, టియర్ స్మోక్ మ్యూనిషన్ సిస్టమ్ వంటివి. ఇతర సామర్థ్యాలు క్యాబిన్ ప్రజర్ సిస్టమ్, తగిన ఎలక్ట్రానిక్ విజన్ సిస్టమ్‌లతో రిట్రాక్టబుల్ మల్టీ బ్యారెల్ టియర్ గ్యాస్ లాంచర్, వైడ్ యాంగిల్ సర్వైవలెన్స్, మల్టీ ఛానల్ వీడియో ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, జీపీఎస్ ట్రాకర్, నావిగేటర్. డిజైన్ ఆర్కిటెక్చర్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్‌ల్లో తేలికగా, వేగంగా కస్టమైజేషన్ చేయడానికి అనుమతిస్తుంది. ఎంసీవీల ప్రొడక్షన్ వెర్షన్లు యూజర్ల వాస్తవ అవసరాలు, ఫంక్షనల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించనున్నారు.