ఆహారంగ్రామీణం

ఫారెస్ట్ గ్రౌండ్ ను పార్కుగా తీర్చిదిద్దుతాం.

నాతవరం : నాతవరంలో స్థానిక శాసనసభ్యులు పెట్ట ఉమాశంక‌ర్ గ‌ణేష్‌ సహకారంతో ఫారెస్ట్ గ్రౌండ్‌ని సుందరమైన పార్కు తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అంకంరెడ్డి జమీల్ తెలిపారు. శనివారం ఎంపీడీవో కే.సూర్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు జమీల్ మాట్లాడుతూ ఈ గ్రౌండులో పార్కులో, వాకింగ్ ట్రాక్ చేసే ఆలోచన ఉందని అన్నారు. గ్రౌండులో పచ్చదనంతో పాటు-సాయంకాలం వేళ కూర్చోడానికి, ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి లోకుల‌ యాదగిరిశ్వరరావు, నాతవరం పిఎసిఎస్ అధ్యక్షుడు అప్పలరాజు, ఏపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి చిన్న బాబు,పెరుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…