న్యూస్ప్రాంతీయంసంస్కృతిస్థానికం

ఘ‌నంగా జ‌రుగుతున్న శ‌త‌చండీ యాగం.

నర్సీపట్నం: ఉత్తర వాహిని నది తీరంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రాంగణములో శత చండీ సహిత శ్రీ రుద్రయాగం మంగళవారం రెండవ రోజు అత్యంత వైభవంగా జరుగుచున్నది ఉదయం 121 సార్లు శివాభిషేకం, చండీ పారాయణం గోపూజ మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.సాయంత్రం రుద్ర హోమము మరియు చండీ హోమం నీరాజన మంత్ర పుష్పములు జరిగాయి. రేపు ఉదయం ఇదే విధముగా అభిషేక అర్చనలు తదుపరి 12 గంటలకు విశేష అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందని కమిటి పెద్దలు తెలియజేసారు.సాయంత్రం 5.15 నిమిషములకు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుతుందని కావున భక్త జనులు అందరూ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు తెలియజేశారు.