ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంవిశాఖపట్నం

ఘనంగా నర్సీపట్నం జాప్ యూనియన్ ద్వితీయ వార్షికోత్సవం.

నర్సీపట్నం,కోస్తాటైమ్స్,(ఫిబ్రవరి -16) : జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ )యూనియన్ నర్సీపట్నం శాఖ ద్వితీయ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి నర్సీపట్నం యూనియన్ మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలమంచిలి వేణు మాట్లాడుతూ నర్సీపట్నం జాప్ యూనియన్ ఈ రెండు సంవత్సరాల కాలంలో యూనియన్ పరంగానే కాక సామాజికపరంగాను అనేక సేవలు అందించి, అనేక విజయాలు సాధించిందని ఆయన అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తారన్న వార్త వినగానే రెండుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు.అంతేకాక జర్నలిస్టుల సమస్యలపై స్పందించి స్పందన లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి డిపిఆర్ఓ మీద ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇతర జర్నలిస్టు సంఘాలతో సహృద్భావంతో సహకారంతో మెలుగుతున్నామన్నారు.సీనియర్ రిపోర్టర్ పసుపులేటి రాము అకాల మరణం చెందినప్పుడు యూనియన్లకు అతీతంగా ఆయనకు ప్రత్యేక నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో కొనసాగుతూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు యూనియన్ తరపున చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ, యూనియన్ సభ్యులందరికీ రూ.ఐదు లక్షల ప్రమాద భీమా అందించామన్నారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జిటివిఎస్ఆర్ కె రాజు, కార్యదర్శి లంక శివ, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వర్రే రమణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి జామిశెట్టి శ్రీధర్, ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు ఎం.అప్పలరాజు, కోశాధికారి కె తాతాజీ, సీనియర్ టివి 9 రిపోర్టర్ ఏసుబాబు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు…