ఆహారంజిల్లాలుప్రాంతీయం

కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి 123వ జయంతి వేడుకలు…

కృష్ణదేవిపేట : కృష్ణదేవిపేట గ్రామంలో  సీతారామరాజు 123వ జయంతి  సీతారామరాజు పార్కులో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్వాతంత్ర సమరయోధుడు,విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధికి,పార్కుఆవరణంలో గల అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి పార్కును పర్యాటకంగా  అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మన్యంలోని గిరిజనులపై తెల్లదొరలు చేస్తున్న దోపిడీని అరికట్టాలనే లక్ష్యంతో పిన్న వయస్సులోనే అల్లూరి
సీతారామరాజు పోరాట యోధుడు అయ్యారన్నారు.ఆ సమయంలో గిరిజనులకు రక్షించేందుకు తెల్లదొరలపై అనేక
విధాలుగా పోరాటాలు చేసిన మహనీయుడన్నారు.గిరిజనుల అభివృద్ధికి కృషిచేసిన అల్లూరిని నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని మరిన్ని పోరాటాలు సాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈకార్యక్రమంలో గొలుగొండ తాసిర్థర్ ,వైసిపి సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు,పంచాయతీ కార్యదర్శి అప్పారావు,రుత్తల శివరామకృష్ణ ,సుర్ల గిరిబాబు,నర్సీపట్నం రురల్  వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ స్థానిక  వైసిపి నాయకులు, గ్రామ యువత పాల్గొన్నారు…