ఆంధ్రప్రదేశ్న్యూస్రాష్ట్రీయంవిశాఖపట్నం

ఘనంగా ఎన్టీపీసి 48వ రైజింగ్ డే వేడుకలు.

పరవాడ,కోస్తాటైమ్స్ : దేశంలో ఉన్న అన్ని ఎన్టీపీసి సింహాద్రి పవర్ ప్రాజెక్టులు మరియు కార్యాలయాల్లో సోమవారం 48 వ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఎన్టీపీసి సింహాద్రి అడ్మిన్ స్ట్రేటివ్ బ్లాక్ లో అధికారుల సమక్షంలో జరిగిన రైజింగ్ డే వేడుకలకు సంస్ధ జీజీఎం గిరీష్ చంద్ర చౌక్సే ముఖ్య అతిధిగా పతాక విష్కరణ చేసి,బెలూన్లు విడుదలచేసి అంతరం కేక్ కటింగ్ చేసారు.ఈ సందర్భంగా జీజీఎం మాట్లాడుతూ ఎన్టీపీసి యొక్క 4 దశాబ్దాల ప్రస్ధానంలో 62910 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే స్ధాయికి చేరడం గర్వించదగ్గ విషయమని, ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో ఉద్యోగుల సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో మరింత ప్రగతిని సాధిస్తూ ఎన్టీపీసి యొక్క ఫ్రంట్ రన్నర్ ప్రాజెక్టుగా సింహాద్రి మరిన్ని విజయాలను సాధిస్తుందని ఈ సందర్భంగా జీజీఎం ఆశాభావం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో ఎన్టీపీసి జియమ్ లు, హెచ్వోడీలు, యూనియన్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు…