ఆహారంరాజకీయంస్థానికం

రాజధాని వికేంద్రీకరణ,సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు పంపిన అసెంబ్లీ అధికారులు

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు పంపిన అసెంబ్లీ అధికారులు..ఈ నెల 17తో మండలిలో రెండు బిల్లులకు గడువు ముగియ‌టంతో గవర్నర్ కు ఈ బిల్లుల‌ను అధికారులు పంప‌డం జ‌రిగింది.ఈ బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదిస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంద‌ని నిబంధనలు మేరకు 30 రోజులు వేచి చూశామ‌ని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కోన్నారు. మండలిలో గడువు ముగిసింది కాబట్టి బిల్లు ఆమోదం పొందినట్లే మంత్రి తెలిపారు.రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో ఒక‌టే రాజ‌ధాని అంశం ఉంద‌ని మూడు రాజ‌ధానులు అంశం ఏర‌కంగా మంచిది కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిన రాజ‌ధాని బిల్లు,సిఆర్‌డిఏ బిల్లుల‌ను ఆమోదించ వ‌ద్ద‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌కు లెట‌ర్ వ్రాసారు.ఈ బిల్లులు సెల‌క్ట్ క‌మిటీ ప‌రిశీల‌న‌లో ఉన్న‌వ‌ని రాష్ట్రప్ర‌భుత్వం హైకోర్ట్‌కు చెప్ప‌డం జ‌రిగింద‌ని ఇప్పుడు ప్ర‌భుత్వం గ‌వ‌ర్నర్ ‌కు ఈభిల్లులు ఆమోదంకై పంప‌డం ఏర‌కంగా ప్ర‌జాస్వామ్యం అనిపించుకోద‌ని ఈ విష‌యంలో అటార్నీజనరల్ అభిప్రాయం తీసుకోవాలని కోరిన యనమల కోరారు…