జాతీయం

బాబు జగ్జీవన్‌రామ్ గవర్నర్ ఘన నివాళి

పుదుచ్చేరి, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పాటు నిర్విరామ కృషి చేసిన యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. పుదుచ్చేరిలో ఈరోజు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలలో ఆమె పాల్గొన్నారు.