ఆహారంరాజకీయంస్థానికం

నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి.

నర్సీపట్నం: నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జనసేన నియోజకవర్గం నాయకులు రాజాన వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్థానిక ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహంనకు నివాళులు అర్పించి ఆర్డిఓ ఆఫీస్ గేటు ఎదురుగా పార్టీ నాలుగు మండలాల నాయకులు పాల్గొని నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజన్న సూరి చంద్ర మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇటీవల ప్రభుత్వం యోచన చేస్తున్న అనకాపల్లి జిల్లా కేంద్రం కాకుండా నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాగా చేయాలన్నారు.విశాఖ గ్రామీణ ప్రాంతం అనకాపల్లి పార్లమెంట్ కేంద్రమైన అనకాపల్లిని జిల్లాగా ప్రకటించే కంటే నర్సీపట్నం జిల్లాగా ప్రకటిస్తే నర్సీపట్నంకు ఆనుకొని ఉన్న 16 మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.ఏజెన్సీ ముఖద్వారంగా పిలవబడే నర్సీపట్నం జిల్లా  కేంద్రంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఈ విషయంలో రాజకీయాలకి అతీతంగా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒత్తిడి తీసుకురావాలని  కోరుతున్నామన్నారు. మిగతా పార్టీ పెద్దలు కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వారు అభ్యుదయ సంఘాల వారు యువజన సంఘాల వారు మహిళా సంఘాలు అందరూ కలిసి నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తమ తమ నినాదాలు ప్రభుత్వం వరకు చేరేలా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.