జయపురం/ఒడిశా: సాబుబార్గో ఖోబార్ మూడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.ఆదివారం జయపురం రుతురాజ్ సభ మండపంలో జరిగిన వార్షికోత్సవం కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రముఖులు హాజరయ్యేరు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు రాజేందర్ గౌడో సొకాలో దినపత్రిక రాకేశ్ పాడి, ప్రమయ ఎడిటర్ ప్రకాష్ చంద్ర దాస్, సోబుబార్గో ఖాబార్ పత్రిక నిర్వాహకులు చీప్ ఎడిటర్ చంద్రకాంత్ సుతార్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత లక్ష్మీకాంత్ పాడి,బీజేడీ పార్టీ నాయకులు బాల రాయ్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా సాహిర్త్య,కవిత ప్రదర్శన ఏర్పాటు చేశారు.విజయలక్ష్మి పాణిగ్రహి,గౌరీ పొండ,సంజుక్త రౌతో కవితలు అందరికీ ఆకట్టుకున్నాయి.అనంతరం పత్రిక మూడవ వార్షికోత్సవంలో మొదటి పత్రిక విడుదల చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలో ప్రింట్ పత్రిక నడపటం చాలా కష్టం అయిన అతను ప్రతిసంకలనం సరియైన సమయంలో ఈ మూడు సంత్సరాల నుండి నడిపిస్తూ వస్తున్నారని తెలిపారు.పత్రిక విడుదల చెయ్యడం కోసం అతను చాలా కష్ట నష్టాలు ఎదురుకుంటు వస్తున్నారని పత్రికకు ప్రముఖులు ఆర్థిక సహాయం చేయాలని లక్ష్మీకాంత్ పాడి అన్నారు. సొకల్ దినపత్రిక రాకేశ్ పాడి మాట్లాడుతూ పత్రిక చిన్నది పెద్దది అనే మాట సరియైనది కాదని పత్రిక చిన్నదైన పెద్దదైన ఏదైనా ఒకటే ప్రజల సమస్యలకు ప్రభుత్వం మరియు పాలకుల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రముఖులు ప్రజలకు మంచి కలగ జేసేదే పత్రిక ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కోన్నారు.రాష్ట్రంలో ప్రముఖ పత్రిక ప్రమయ ఎడిటర్ ప్రకాష్ చంద్ర దాస్ మాట్లాడుతు ప్రస్తుత కాలంలో యువత వార్త పత్రికలు పుస్తకాలు చదవడం లేదని వారికి చదవడం నేర్పించాలన్నారు. చివరిగా సోబుబార్గో ఖోబార్ పత్రిక నిర్వాహకులు చీప్ ఎడిటర్ చంద్రకాంత్ సుతార్ మాట్లాడుతూ రానున్న కాలంలో మా పత్రిక ప్రతిరోజూ రానున్నదని వ్యక్తం చేసారు.పాఠకులకు సహాయా సహకారాలతో మూడు వార్షికోత్సవంలు జరుపుకుందని రానున్న కాలంలో పత్రికకు ఆదరించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంకి జయపురం విలేఖరుల హాజరయ్యారు.సాహిత్యాభిమానులు పాల్గోన్నారు…