గ్రామీణంన్యూస్ప్రాంతీయంస్థానికం

గుండుపాల అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న నవ్య లైన్స్ క్లబ్

ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించిన క్లబ్ ప్రతినిధులు

నర్సీపట్నం, కోస్తాటైమ్స్,( అక్టోబర్ 18) : గత శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన గొలుగొండ మండలం గుండుపాల అగ్ని ప్రమాద బాధితులకు నర్సీపట్నం నవ్య లైన్స్ క్లబ్ అండగా నిలిచింది. బుధవారం నవ్య లైన్స్ క్లబ్ ప్రతినిధులు గుండుపాల గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన గ్రామానికి చెందిన పంపరబోయిన రాజబాబు, పంపరబోయిన తాతాలు కుటుంబాలకు రూ. 20 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, నెల రోజులకు సరిపోయే బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. అంతేకాక నవ్య లైన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ చెరుకూరి ఇందిర, వైస్ ప్రెసిడెంట్ వెలగా నారాయణరావు లు ప్రతినెలా బాధిత కుటుంబాలకు రూ.2 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ మెంబర్షిప్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణ సమయంలో మరింత ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి చంద్ర రాజు, సభ్యులు కన్నబాబు, కర్రి రామ్ గోపాల్, పద్మనాభుని కన్నయ్య శెట్టి, స్థానిక సర్పంచ్ జోగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.